వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అక్షరసత్యాలు

  • 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష

విజయవాడ వెస్ట్: పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా, అదేవిధంగా రెవిన్యూ వ్యవస్థ ఉండగా వీటికి సమాంతరమైన వ్యవస్థ మరొకటి వాలంటీర్ వ్యవస్థ తయారు చేయటానికి గల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పాలని విజయవాడ 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష ప్రశ్నించారు. శనివారం తిరుపతి అనూష విలేకరులతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థ అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారా..? ఈ వాలంటీర్ వ్యవస్థ కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా వాలంటరీల్లో మీ సహోదరులు ఎవరైనా ఇలాంటివారు ఉన్నారా గమనించుకోండని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొంతమంది వాలంటీర్లు అత్యాచారాలు చేయలేదా, పింఛన్ డబ్బులు తీసుకుని పారిపోలేదా, నాటు సారాలు కాయ లేదా, నకిలీ నోట్లు మార్చలేదా, కిడ్నాప్లు చేయలేదా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయలేదా, ఎంతోమందిని బెదిరించలేదా..? దీనికి వైసిపి నాయకులు సమానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి స్వలాభం కోసం ఇంతమంది యువత భవిష్యత్తుని 5000 రూపాయలతో ఆపేద్దాం అని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డి పెట్టిన మా పవన్ కళ్యాణ్ గారు. ఇదే వ్యవస్థను అడ్డంపెట్టుకుని ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారికంగా సాక్షి పేపరు అడ్డుపెట్టుకుని 240 కోట్ల రూపాయలు సంపాదించింది నిజం కాదా..? ఇదంతా ప్రజల డబ్బు కాదా..?. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అంటే ప్రతి సంవత్సరం కొంతమంది వాలంటీర్ లని జగన్ గారి సైన్యాన్ని తయారు చేసుకోవడమేనా.. జగన్ గారు చెప్తున్నవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు చేసినవన్నీ అక్రమాలు అవి మా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు వివరిస్తుంటే అది ఓర్వలేని వైసీపీలో నాయకులలో కొంతమంది ముత్తైదువులు బయటకు వచ్చి జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శీను, గుడివాడ అమరనాధ్, రోజా పిచ్చికుక్కలాగా మొరుగుతున్నారఅని అనూష పేర్కొన్నారు.