క్షతగాత్రులను పరామర్శించిన జనసేన నాయకులు

  • క్షణికావేశం అత్యంత ప్రమాదకరమని, గొడవలకు దూరంగా ఉండాలని ఇరు వర్గాలకు హితవు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. బుధవారం పార్వతీపురం మండలంలోని ఎమ్మార్ నగరంలో జరిగిన కొట్లాట విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, రాజానా బాలు, గుండ్రెడ్డి గౌరీ శంకర్రావు, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు తదితరులు పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా కొట్లాటలో గాయపడిన బసవ ధర్మారావు, తిరుమరెడ్డి బలరాం కుటుంబ సభ్యులను పరామర్శించి, కొట్లాటకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒకే గ్రామంలో తెల్లవారితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండే గ్రామస్తులు గొడవలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. క్షణికావేశం ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. కుటుంబాలను నడిరోడ్డుపై విసిరేస్తోందన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఏ సహాయం కావాలన్నా తమ సంప్రదించాలని క్షతగాత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు పాల్గొన్నారు.