నాదెండ్ల కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మామ గారు కొద్దిరాజుల క్రితం కాలం చేసారు. జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద్ (చినబాబు), జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి గడ్డమానుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు బుధవారం కార్యానికి హాజరై వారికి నివాళులు అర్పించారు. రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపారు.