తోట వెంకటేశ్వరరావుని పరామర్శించిన జనసేన నాయకులు

ఉమ్మడి గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణం హనుమాన్ నగర్ కి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తోట వెంకటేశ్వరరావు యక్షిడెంట్ గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని సురక్ష హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తోట వెంకటేశ్వరరావుని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ పరామర్శించడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు రూపాయలు 10000/- ఆర్థిక సాయం చేయడం జరిగింది. తోట వెంకటేశ్వరరావు త్వరగా పూర్తి స్థాయిలో కోలుకొని మన మధ్యలోకి రావాలని ఆశించారు.