సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు

నెల్లూరు, ఉపాధ్యాయిని సంఘ సంస్కర్త, కవయిత్రి స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరు సిటీ మినీ బైపాస్ నందుగల వారి విగ్రహానికి జనసేన పార్టీ తరఫున నెల్లూరు జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన, నిమ్న కులాల మహిళలకు విద్యా ఆవశ్యకతను తెలియజేయడమే కాకుండా ప్రథమంగా బాలికల పాఠశాల నేర్పరచి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఎంతగానో కృషి చేశారు. సావిత్రిబాయి మరియు జ్యోతిరావులే దంపతులు అంటరానితనం రూపుమాపేందుకు అనేక సామాజిక ఉద్యమాలు చేశారు. బాల్యవివాహాల రూపుమాపేందుకు, సతి సహగమనం వంటి దురాచారాలను రూపు మాపేందుకు, వితంతు వివాహాలు జరిపేందుకు వారు చేసిన సేవ చిరస్మరణీయం. సమాజంలో అట్టడుగున బతుకుతున్న వారికి విద్య నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను అదేవిధంగా విద్య నేర్పించే మార్గాలను సూచించిన వారి సామాజిక స్పృహకు సాటిలేని కృషిచేసిన ఆ మానవతామూర్తికి జనసేన పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాము. ఇటువంటి స్త్రీ మూర్తుల స్పూర్తితో పవన్ కళ్యాణ్ తరచూ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత గుర్తు చేస్తుంటారు.ఈ విషయాన్నే చట్ట సభలలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ప్రతిపాదించిన విషయాన్ని గుర్తెరిగి మహిళలు అందరూ రాజకీయ సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో వీర మహిళలు కృష్ణవేణి, నిర్మల, హసీనా, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, బన్నీ, శీను, కేశవ, మౌనీష్ తదితరులు పాల్గొన్నారు.