జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు రూరల్ మండలంలో గల విజ్జేశ్వరం గ్రామానికి చెందిన జనసైనికుడు కప్పుల లక్ష్మీ శివనారాయణ కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనికి కొవ్వూరు వెళ్లి వస్తుండగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద లారీ ఢీ కొనడంతో అతని యొక్క రెండు భుజాల ఎముకలు తీవ్ర స్థాయిలో దెబ్బతినడం వల్ల అతనిని తాళ్ళపూడి సాయిస్ఫూర్తి హాస్పిటల్ లో రెండు భుజాలకు ఆపరేషన్ చేయడం జరిగింది. విజ్జేశ్వరం జనసైనికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జిల్లా కార్యదర్శి తులా చినబాబు, సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని, నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మరియు విజ్జేశ్వరం జనసైనికులు సూరిశెట్టి శేషగిరి, ఆదూరి రాజేష్ తదితరులు కలిసి హాస్పిటల్ కి వెళ్లి అతనికి ధైర్యం చెప్పి అతని కుటుంబానికి జనసేన పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.