అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేసిన జనసేన నాయకులు

అంబేద్కర్ కోనసీమ, అమలాపురం పట్టణం గండు వీధిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వాటర్ బెడ్, ఆర్ధిక సాయం జనసేన నాయకులు అందచేసారు. ఈ కార్యక్రమంలో పురపాలక మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, పురపాలక ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, 4వ వార్డు కౌన్సిలర్ పడాల శ్రీదేవి, జనసేన పార్టీ గౌరవ సలహాదారు నల్లా శ్రీధర్, పడాల నానాజీ, గుర్రాల కన్నా, మామిడిపల్లి శేషు, జనసైనికులు, పాల్గొన్నారు.