తుఫాన్ బాధితులను ఆదుకొన్న జనసేన నాయకులు

కావలి నియోజకవర్గం: మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాలను జనసేన ఇంచార్జీ అళహరి సుధాకర్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం అంతటా జనసేన నాయకులు పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇందులో భాగంగా కావలి రూరల్ అధ్యక్షుడు వెంకయ్య నాయకులతో కలిసి మత్యకారులు నష్టపోయిన బోట్లను పరీక్షించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా కావలి బాలకృష్ణ నగర్ లో వృద్ధ దంపతుల ఇల్లు పై కప్పు పూర్తిగా పొయి ఇల్లు మొత్తం నీళ్లలో ఉంటే వారి ఇంటిపై కప్పు కప్పించి వారికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కావలిలో చెరువును తలపించేలా ఉన్న ఎమ్మెల్యే ఇంటి రోడ్డు దారుణమని, నియోజకవర్గం తీరప్రాంతము మరియు లోతట్టు ప్రాంత ప్రజలు రైతులు, మత్యకారులు, మధ్యతరగతి, చిరు వ్యాపారులు, రోజు కూలీ చేసుకొనే బడుగు బలహీనవర్గాల వారు ఎన్నో ఇబ్బందులు పడి చాలా నష్టపోయారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వము ఆదుకోవాలని ముఖ్యంగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తమ సహయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా విధ్యుత్ శాఖ అధికారులు తుఫాన్ ప్రభావంగా దెబ్బతిన్న కరెంటు తీగలు స్తంభాలను పుననిర్మించి యుద్ధ ప్రాతిపదికన పునర్థరించాలని, తాగునీరు తక్షణం అందరికీ అందించాలని జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని, వెంటనే మంచి నీరు అందించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ తరుపున భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం అని, వాటర్ ట్యాంకుల ద్వారా నీరు కూడా అందిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి వెంకయ్య, వెంకయ్య బాబు, సుధీర్, శ్రీనాథ, బాలు, మల్లికార్జున తదితర జనసైనికులు పాల్గొన్నారు.