బెహరా బ్రాహ్మణ కుటుంబాలతో జనసేన మాటామంతి

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నగరంలోని బెహరా బ్రాహ్మణ కుటుంబాలను కలిసి మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టారు. గతకొన్ని రోజులుగా తమ పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నగరంలోని వివిధ వర్గాల కుటుంబాలను కలిసి వారితో వారు ఎదుర్కుంటున్న సాధక బాధకాలను ప్రభుత్వ సంక్షేమ పధకాల లభ్యతపై కూలంకషంగా మాట్లాడుతూ వారి కుటుంబసభ్యుడిగా జనసేన పార్టీ కోరుకుంటున్న సందర్భంలో ఆదివారం బెహరాబ్రాహ్మణ కుటుంబాలవారిని కలవడం జరిగినది. ఈ సందర్భంగా వారు తాము బలహీన వరగాల రిజర్వేషన్లో ఉన్నప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలను పొందలేకపోతున్నామన్నారు. కులవృత్తిలో ఉన్నవారు కరోనా మహమ్మారి వచ్చినప్పటినుండీ ప్రజల ఆందోళనల వల్ల తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నామనీ సరైన రాబడిలేక ఆర్ధికంగా అప్పులపాలైపొతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ తరతరాలుగా కులవృత్తులు చేపట్టి జీవనాన్ని సాగిస్తున్న ఈసామాజిక వర్గంవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వీరి పరిస్థితి దయనీయంగా ఉందనీ, వీరందరికోసం కూడా పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఆలోచిస్తుందని చెప్పడంతొపాటూ వారికి ధైర్యాన్ని చెప్పడానికి కలుసుకోవడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాలుగా బెహరాబ్రాహ్మిణ వర్గం చాలా వెనుకపడిపోయి ఉందనీ, వీరికి ప్రభుత్వ పధకాలు ఏవీ గణనీయంగా అందట్లేదనీ తెలియవచ్చిందనీ జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలనీ సమానంగా చూస్తాదనీ అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా రానున్న కాలంలో రాబోతోందనీ వీరినందరినీ పైకి తీసుకువచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని భరోసానిచ్చారు.