జనసేన సభ్యత్వం ఒక కుటుంబానికి అండ..!

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యునికి ఆర్థిక చేయూత..
  • ప్రమాద బాధితునికి 500000/- లక్షల రూపాయల చెక్ అందజేసిన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవింద్ రావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ప్రతిష్టాత్మకంగా అమలులోనికి తీసుకు వచ్చిన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆపత్కాలంలో అండగా నిలవాలన్న సంకల్పం బాధిత కుటుంబానికి బాసటగా నిలుస్తోందని జనసేన జిల్లా అధ్యక్షులు అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు ఎర్రోజు శ్రీను ప్రమాదానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రూ 500000/- లక్షలు విలువ చేసే చెక్ ను బుధవారం వారి గృహానికి వెళ్లి కొటికలపూడి గోవిందరావ్ మరియు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన క్రియాశీలక సభ్యత్వం ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉందన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కష్టకాలంలో పార్టీ అండగా నిలుస్తుందన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ప్రతి జనసైనికుడికి జనసేన పార్టీ అండగా వెన్నంటూ నిలుస్తుందని చెప్పారు, క్రియాశీలక సభ్యత్వం ఫిబ్రవరి 10 నుంచి కొత్తగా మరియు రెన్యువల్ చేసుకోదలచినవారు ఎవరైనా ఉంటే జనసేన వాలంటీర్ దగ్గర చేసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు, ఈ సభ్యత్వం ఒక కుటుంబానికి అండగా ఉంటుందని వివరించారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఆపత్కాలంలో తమకు అండగా నిలిచిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారికి మరియు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి మరియు జట్లపాలెం గ్రామం జనసేన నాయకులు పెనుబోతుల సోమలమ్మ, బాలాజీ, కూరేళ్ల శ్రీను, కసిరెడ్డి మధులత, వర్తనపల్లి కాశి, అడపా ప్రసాద్ మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.