నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రశ్నార్దకం..!: గునుకుల కిషోర్

నెల్లూరు: నెల్లూరు రూరల్ అభివృద్ధి ప్రశ్నార్దకం… జిల్లాలో వైసీపీ నాయకులు వర్గ పోరుతో జిల్లాలో సాధించిన అభివృద్ధి శూన్యం.. అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా బుధవారం రెండవ డివిజన్లో కార్యకర్తలు బాలు, వినోద్ మళ్లీ, శ్రీకాంత్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల మద్దతు కోరుతూ ఇరుగు పొరుగు వారిని జనసేన పార్టీని ఈసారి గెలిపించాల్సిందిగా కోరారు. జనసేన క్రియాశీలక సభ్యుల సభ్యత్వం యొక్క ఆవశ్యకతను తెలియజేసి వారికి సభ్యత్వ నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నెల్లూరు రూరల్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కానీ వాటిని ఎవరు పూర్తి చేయాలో అర్దం కావట్లేదు.నియోజకవర్గం వైసీపీ నాయకుల వర్గపోరుతో అభివృద్ధి కుంటుపడింది. గతంలో పని చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఎవరిని అడిగి తీసుకోవాలి, ఎటు వెళ్తే ఏమవుతుందని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు ఎవరికి మద్దతు ఇస్తే ఏమవుతుందో ఎప్పుడు ఎక్కడ డబ్బులు ఆగుతాయో అని అల్లాడుతున్నారు.పదవులకై పాకులాడే వారికి కాక ప్రజల సమస్యల పై పోరాడే నాయకులను ఎన్నుకోవాలి అని అన్నారు. ప్రజలను పట్టించుకునే నాథుడే లేదు, పాత కొత్త వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆధిపత్య పోరుతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అల్లాడుతుందని తెలిపారు. వీరికి మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న జనసేన పార్టీకి ఓటు వేసి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వానికి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు బాలు, శ్రీకాంత్, మళ్లీ, వినోద్, శ్రీకాంత్, ప్రశాంతి గౌడ్, అమీన్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.