టిటిడి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం జరిగేంత వరకు జనసేన మీవెంటే- కీర్తన

తిరుపతి, గత వారం రోజులుగా టిటిడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాత్రనక పగలనక తేడాలేకుండా న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే, వారి న్యాయ పోరాటానికి జనసేన మద్ధతు తెలపడం కుడా జరిగింది. ఇదే విషయం పై జనసేన అధినేత గతంలో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జనసేన నాయకురాలు కీర్తన మాట్లాడుతూ టిటిడిలో పనిచేస్తున్న కార్మికులకు గతంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో టైం-స్కేల్ ఇచ్చి, రెగ్యులరైజేషన్ చేసి మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కార్పొరేషన్లో చేరుస్తానని ఇచ్చిన హామీని బోర్డు మెంబెర్ శ్రీ సుబ్బారెడ్డి కూడా అంగీకరించడం జరిగిందని, కాని ఇపుడు పాలకమండలి ఏర్పడిన తరువాత ఇపుడు అందరిని కార్పొరేషన్లో చేరుస్తాననడం ఎంతవరకు సబబు అని, వారందరు ఇన్ని సంవత్సరాల సర్వీసుని పోగొట్టుకోవడనికి ఎందుకు సిద్ధంగా ఉంటారని, వారికి ప్రస్తుత వేతనం మూడు వేల నుండి ఆరువేల వరకు ఉందని మరియు బస్సు పాసు సదుపాయాన్ని కూడా కల్పించాలని అన్నారు. మహిళలు వారి సమస్యలపై పోరాడుతుంటె కనీసం వారికి మంచి నీల్లు ఇచ్చేవారు కూడా కరువయ్యారని అన్నారు. ఆ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ముందుకు వచ్చి చిత్తూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ మధు అక్కడ 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినా వారు దానిని తినకుండా ఏడ్చుకుంటూ వారి సమస్యల్ని జనసేన నాయకులకు చెప్పుకుంటే జనసేన నాయకులు వారికి భరోసా ఇచ్చి అర్ధరాత్రి వరకు వారితో ఉండి రావడం జరిగింది. మీకు ఓటు వేసారని, కరోనా సమయంలో కుడా వారు సేవలందించారని గుర్తు చేసారు. మహిళలు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని మహిళలకి దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు కూడా లేవని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని, టిటిడి యాజమన్యాన్ని జనసేన పార్టీ హెచరిస్తుందని, భగవంతునికి చేస్తున్న సేవలను గుర్తించాలని, వారి పోరాటం న్యాయమైనది, నిజమైనది కనుక వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని, రెగ్యులరైజ్ చేయాలని, కార్పొరేషన్లో చేర్చాలని జనసేన డిమాండ్ చేస్తుందని తెలిపారు.