సాంబమూర్తి నగర్ 5వలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు శుక్రవారం డాక్టర్ బాబు ఆధ్వర్యంలో 6వ డివిజన్ సాంబమూర్తి నగర్ 5 వ వీధి ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర నిర్వహించడం జరిగినది. ఈ ప్రాన్తంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు కలిసి సంభాషించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం వర్గాలు మరియు పిల్లలు సహజంగా ఉర్దూ భాష మీద కొంత పట్టు కలిగి ఉంటారనీ మతపరమైన ఆసక్తితో చదువుకోడానికి కూడా ముందుకు వస్తారనీ, నగరంలో ఉన్న అతికొద్ది ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలను తగిన విద్యార్ధుల సంఖ్య లేదన్న సాకుతో ఈ ముఖ్యమంత్రి వేరే స్కూళ్ళలోకి విలీనమో లేదా మూసివేయడమో చేసాడనీ, అసలే ముస్లింలలో మహిళలు చదువులకోసం బయటకి రావడం తక్కువ అనీ దానికి తోడు ఇలాంటి చర్యలతో మానేస్తున్నారనీ ఇది ఒకరకంగా వారిని కావాలని చీకటిలోకి నెట్టడం కాదా అని ప్రశ్నించారు. ఈ వై.సి.పి ప్రభుత్వానికి పాలనపై సరి అయిన పట్టులేదనీ గాలివాటం పనులతో ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. సచార్ కమిటీ సూచనలను అమలుచేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎం.డి మొయినుద్దీన్, ఎం.డి షమీర్, కశ్మూర్ ఖాన్, హాబీబుల్లా, పఠాన్ ఖాన్, సయ్యద్ బాజీ, షేక్ బషీర్, దవులూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.