జనసేన ఎన్నారై సేవాసమితి మరియు గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవ రాయుల జయంతి వేడుకలు

కువైట్ లో కంచన శ్రీకాంత్ మరియు దండు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 551 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలు వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆనాడు ముందుచూపుతో నీటి ఆవశ్యకత ను గుర్తించి ఎన్నో చెరువులు నిర్మించడంలో పాటు తెలుగు భాష అభివృద్ధి విశేషమైన కృషి చేశారని దేశంలో పలు దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మికతను పెంపొందించిన మహా మనిషి శ్రీ కృష్ణదేవరాయలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోలా మురళి, జగిలి ఓబులేసు, కొమ్మినేని బాలాజి, జోగినేని నాగేంద్ర, అల్లం ప్రేమ్ రాయల్ దండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.