తెలంగాణ గడ్డపై జనసేనాని హవా…!!

  • రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ జనసైన్యంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం…!!

హైదరాబాద్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా రూట్ మ్యాప్ ద్వారా హైదరాబాద్ ఎల్.బి నగర్ అలకాపురి చౌరస్తా వద్ద జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు రాష్ట్ర యువజన విభాగం ప్రతి కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రతి జనసైనికుడి తరపున, వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….

  • జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి నాయకులకి అందరికి కృతజ్ఞతలు.
  • రానున్న రోజుల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుంది.
  • తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగరేద్దాం.
  • తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కచ్చితంగా ఉంటుందని భవిష్యత్తులో జనసేన జెండా తెలంగాణలో ఎగరేద్దామని అన్నారు.