జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం: పసుపులేటి పద్మావతి

అనంతపురం: జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పై తప్పుడు సమాచారంతో అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, వారిపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని మీడియా ముఖంగా పోలీసు వారికి పసుపులేటి పద్మావతి విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు గత 200 రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అనంతపురం నగరమంతా తిరుగుతూ, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది పైచిలుకు ప్రజలను కలిసి జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేస్తూ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వలన తమ ప్రభుత్వ పనితీరును దాని వైఫల్యాలను జనానికి బట్ట బయలు చేస్తున్నారని ఇంటింటా జనసేన కార్యక్రమం వలన జనంలో తమ ప్రతిష్ట అడుగంటి పోతుందని భయంతో, దుర్బుద్ధితో అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మరియు వైసీపీ అధిష్టానం అందరూ కలిసి కుట్రపూరితంగా శ్రీదేవి తదితర వైసీపీ మహిళా కార్యకర్తలను రెచ్చగొట్టి వారిచేత జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, మురళీకృష్ణ, విజయ్ కుమార్ పైన తప్పుడు సమాచారంతో కంప్లైంట్ ఇచ్చినారు. ఆ సందర్భంలో శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ జయరాం రెడ్డిని రోడ్లలో తిరగనియ్యమని, తమ నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతు తేలుస్తామని, జయరాం రెడ్డికి ఏమైనా జరగొచ్చు అని డీఎస్పీ ఆఫీసు ముందు మీడియా సమక్షంలో అభ్యంతరకర భాషలో, పరుష పదజాలంతో జనసేన కార్యకర్తలని బయోత్పన్నానికి గురి చేసే విధంగా మాట్లాడినారు, శ్రీదేవి తదితర వారిపైన తగిన చర్యలు తీసుకుని తక్షణమే వారి పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జనసేన కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో
పసుపులేటి పద్మావతి, జయమ్మ, తేజోలక్ష్మి, జక్కిరెడ్డి పద్మావతి, స్వప్న తదితర జనసైనికులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.