జనసేన పిఏసి సభ్యులు నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సి.జి రాజశేఖర్

కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు సి.జి రాజశేఖర్ జనసేన పిఏసి సభ్యులు నాగబాబును మర్యాదపూర్వకంగా నాగబాబు ఇంటి దగ్గర కలవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీని బలోపేతం కోసం, జనసేన పార్టీని బలంగా జనాల్లోకి తీసుకెళ్లడానికి నాగబాబు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. నాగబాబుగారు మాకు ఎంతో ఇన్స్పిరేషన్, నాగబాబుని కలిసినప్పుడల్లా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు మీ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై బలంగా పోరాడాలని, ప్రజలకు ఎప్పుడూ అండదండగా మీరు ఉండాలని జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రజలకు మరింత దగ్గర చేరవేసే బాధ్యత మీపై ఉన్నదని, అలాగే చనిపోయిన కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు పార్టీ సాయం చేస్తుంది, అలాగే రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉన్నదని తెలిపారు. మీరు బలంగా పోరాడండి మీకు అండదండగా జనసేన పార్టీ మేమంతా అండగా ఉంటామని తెలిపారు. అలాగే పత్తికొండ నియోజకవర్గంలో జనసేన ప్రజాపోరాత్ర ద్వారా గ్రామాలలో ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాగబాబుకి తెలియజేయడం జరిగింది. నాగబాబు మాట్లాడుతూ మీరు జనసేన పార్టీ బలపేతం కోసం మీరు చాలా బాగా కష్టపడుతున్నారని మీలాగే అందరు కూడా కష్టపడి పనిచేస్తే జనసేన పార్టీ 2024లో విజయం దిశగా మనమంతా పని చేద్దామని నూతనంగా పార్టీలో జాయిన్ చేయించుకోవాలి, ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలోకి ఎవరు వచ్చినా మనం ఆహ్వానించాలని తెలియజేశారు.