జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీని అరెస్ట్ చేసిన పోలీసులు

కాకినాడ రూరల్కా: కినాడ రూరల్ పరిధిలోని ఆర్టీవో రోడ్డు వైపు రోడ్డు పక్కనపాకల్లో నివాసం ఉంటున్న కుటుంబాలను నగరపాలక సంస్థ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులతో ఖాళీ చేయించి పాకలను తొలగించడం జరిగింది. ఈ సమాచారం అందిన వెంటనే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ అక్కడికి చేరుకున్నారు. తొలుత కాకినాడ రూరల్ సిఐ కే శ్రీనివాస్, సర్పవరం సి ఐ ఆకుల మురళీకృష్ణ బృందం అడ్డుకుంది. అయితే కచ్చితంగా పరామర్శించి తీరుతాను అని చెప్పి ఆయన ముందుకు వెళ్లి బాధితులతో మాట్లాడడం జరిగింది. ఈలోగా బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చిన ఆయనను అరెస్టు చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో భారీ ఎత్తున జనసైనికులు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.