మోసపోయిన బాధితుడికి అండగా జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలో తన్నీరు రవి తండ్రి పేరు శ్రీను అనే నిరుపేద వ్యక్తి బి.జాం వరకు చదువుకున్నాడు, టంగుటూరులో వైసిపి పార్టీకి చెందిన ఎస్.కె అలెగ్జాండర్ అనే వ్యక్తి చేతిలో మోసపోయాడు. రూపాయలు 1,50,000 ఇస్తే ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో ఎం.ఎన్.ఓ పోస్ట్ ఇప్పిస్తాను, నా వెనుక వైసిపి పార్టీకి చెందిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అని ఎస్.కె అలెగ్జాండర్ చెప్పగా, రవి తల్లి తన కొడుకు భవిష్యత్తు కోసం పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వచ్చి 1,20,000 ఎస్.కె అలెగ్జాండర్ కి ఇవ్వడం జరిగింది. జాబు కోసం ఎన్నో రోజులు ఆశగా ఎదురుచూసిన బాధితులు చివరికి మోసపోయాము అని తెలుసుకొని టంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఎస్.కె అలెగ్జాండర్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. జనసేన వల్ల న్యాయం జరుగుతుంది అని భావించిన బాధితులు సోమవారం జనసేన నాయకులను కలవడం జరిగింది, మోసపోయిన బాధితులు వద్ద ఎస్.కె అలెగ్జాండర్ ఇచ్చిన ఎస్.బి.ఐ చెక్కు, ఎఫ్.ఐ.ఆర్ కాపి, డబ్బులు ఇచ్చేటప్పుడు తీసుకున్న ఫోటో, ఉద్యోగం కోసం రాసుకున్న అగ్రిమెంట్, గతంలో వీరి గురించి పేపర్ లో వేసిన అన్ని పూర్తి ఆధారాలు ఉన్నాయి. బాధితులకు జనసేన పార్టీ కచ్చితంగా అండగా ఉంటుంది, న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తాము, న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి అతి తొందరలో బాధితుడికి న్యాయం చేస్తాము అని జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ మరియు జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్ తెలియచేశారు.