బేతంచెర్లలో జనసేన పల్లెబాట

బేతంచెర్ల, జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా బేతంచెర్ల మండలం గొరుమాను కొండ మరియు గొరుమాను కొండ తాండ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. గ్రామ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు వివరించడం జరిగింది. అలాగే ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన షణ్ముఖ వ్యూహంలోని అంశాలను మరియు ఎంతో గొప్ప మనసుతో కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చోప్పున ఇస్తూ పిల్లల చదువు దృష్ట్యా వారిని ఆదుకునేందుకు చేయిని అందిస్తాం అని భరోసా కూడా ఇస్తున్నారని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా రైతుల పంటలకు సరైన ధరలు అందించడం లేదు, నిలకడ లేని కరెంట్ ఇస్తున్నారని ఎప్పుడూ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అమ్మఒడి ఈ సంవత్సరం పడకపోవడం వచ్చే సంవత్సరానికి కండిషన్స్ పెట్టడం పిల్లల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ అంగన్ వాడి బిల్డింగ్ మరో ప్రధానమైన సమస్య స్థలం కేటాయించి నెలలు గడుస్తున్నా బిల్డింగ్ పనులు మాత్రం ఇంకా చేపట్టలేదు కారణం అడిగితే నిధులు విడుదల కాలేదు అని మాట దాటేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న అంగన్ వాడి బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది కావునా అత్యంత త్వరగా బిల్డింగ్ పనులు మొదలు పెట్టి పిల్లలకు ప్రాణం భయం లేని భద్రత కల్పించాలి అని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల క్రియాశీలక జనసైనికులు మద్దయ్య నాయుడు, పరమేష్, రామకృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.