ఉచిత ఆరోగ్యం పేరుతో అఖిలపక్షం జరిపిన సమావేశంలో పాల్గొన్న జనసేన

హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందరికీ ఉచిత ఆరోగ్యం పేరుతో అఖిలపక్షాలను ఆహ్వానించి, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ తరుపున తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ సూచన మేరకు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తదితర పార్టీల ప్రతినిధులతో పాటు జనసేన అభిప్రాయంగా రాజలింగం మాట్లాడుతూ… గ్లోబల్ సిటీ స్మార్ట్ సిటీ అని చెప్పుకొనే ఎన్నో ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా ఇప్పటికీ అందుబాటులో లేదు. నెల వారి సూదులు చిన్న పిల్లలకు వేసేందుకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొరత ఏర్పడుతుంది. కుక్క కాటుకి కూడా స్థానికంగా ఉన్న ప్రైమరీ లేదా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో రేబిస్ వ్యాక్సిన్ కూడా నిలువ లేకపోగా, ఆ సూది కోసం మన హైదరాబాద్ లో సైతం హిమాయత్ నగర్ దాకా వచ్చి తీసుకోవాలి. ఇలాంటి చిన్న సామాన్య వైద్యమే దొరకకపోతే పెద్ద పెద్ద జబ్బులు వచ్చి, ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి ఏర్పడితే మనలాంటి సగటు మనిషి జీవితం అగమ్యగోచరంగా మారుతుంది. అందుకే ఈ పరిస్థితి మారాలి, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సదుపాయాలు సరైన రీతిలో అందిచే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఓటు కొనడంలో చూపించే తాపత్రయం, వైద్యం అందిచడంలో మాత్రం చూపడం లేదు. అధికారం మీద దృష్టి పెట్టడమే తప్ప, అందరికీ విద్య వైద్యం అందిచాలని మాత్రం ప్రస్తుత ప్రభుత్వాలు ఆలోచన చేసిన దాఖలాలు లేవు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యం ఇంత ఖరీదుగా మారడానికి గల కారణాలను ములాలతో మర్చివేయాలని మా ఆకాంక్ష. ఇక మీద కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి, సామాన్యుల తరుపున నిలబడి ప్రశ్నించి పోరాడటానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని, రాజకీయాలలో అంతిమంగా ప్రజా శ్రేయస్సే మాకు ముఖ్యమని తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటి నాయకులు, తదితర డివిజన్ల శ్రేణులు పాల్గొన్నారు.