జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్వేటి నగరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన: శోభన్ బాబు

ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించువారు దేశ ద్రోహులు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడకపొతే ఎంతటి ప్రాణ త్యాగానికైనా సిద్ధం.
ఇంత జరుగుతున్నా పట్టించుకోని తహసీల్దార్.
ఏది అడిగినా క్రింది స్థాయి ఉద్యోగులకు అంటగడుతున్న అమరేంద్రబాబు.
జనసేన మండల అధ్యక్షులు: శోభన్ బాబు

కార్వేటి నగరం మండలం అర్ కేవిబి పేట పంచాయతీలో కలికిరి ఇండ్లు జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో వైసీపీ నాయకుడు మురళి శాశ్వతంగా ఇళ్ళు నిర్మించుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఇదే పంచాయతీలో వైసీపీ నాయకుడు దుశ్యంత్ కుమార్ మరియు ప్రభుత్వ స్మశానం భూమిలో బోరు వేసుకొని అనుభవిస్తున్నాడు. ఒకసొసైటీ బ్యాంకులో సిఇఓ స్థాయి అధికారికి రేషన్ కార్డు మంజూరు చేసిన తహసీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. రాజుల కండ్రిగలో రమేష్ రాజు అనే వైసీపీ నాయకుడు ప్రభుత్వ బోరును వ్యవసానికి శాశ్వతంగా వాడుకుంటున్నాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నాడు. ఇది వరకే అనేక మార్లు వినతిపత్రం సమర్పించినా కూడా తహసీల్దార్ పట్టించు కోలేదు. ఈ విషయంలో తహసీల్దార్ నిద్ర పోతున్నట్లు నటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను పరిష్కరించక పొతే ఎంతటి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలియజేసారు. అప్పుడే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసిన అధికారులే ఇలా చేయడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడువారు దేశ ద్రోహులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది అడిగినా కింది స్థాయి ఉద్యోగులకు అంటగట్టడం ఎంత వరకు సబబు, ఇలాంటి అధికారిని జిల్లా కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలనీ తెలిపారు. 27/12/2021 వ తేది జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్వేటి నగరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.