క్రియాశీలక సభ్యునికి భీమా చెక్కుని అందజేసిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పుణ్యక్షేత్రం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు సెలది నాగార్జున ప్రమాదవశాత్తూ గాయపడిన విషయం తెలుసుకుని వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం రూ. 50,000₹ రూపాయలు భీమా చెక్కుని వారి కుటుంబానికి ఐక్యరాజ సమితి అవార్డు గ్రహీత మరియు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రం, రాజానగరం మండల యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి, పుణ్యక్షేత్రం జనసేన పార్టీ నాయకులు నరవుల గంగాధర్ (పండు), గొర్రెల వెంకటేష్, పేపకాయల దుర్గాప్రసాద్, సతీష్, కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు తన్నీరు తాతాజీ, తెలగంశెట్టి శివ, కొచ్చర్ల బాబి, కొండ గుంటూరు జనసేన పార్టీ నాయకులు కోటి బాబు, బ్రాహ్మణ దుర్గా రావు, వేగిశెట్టి లోవరాజు, తానికి లోవరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.