ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో జనసేన పార్టీ మండల కార్యవర్గ సమావేశం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో జనసేన పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్షాభావం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, వివరాల సేకరణ, గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ నిర్మాణం, పటిష్టత, త్వరలో సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమం మరియు ప్రజల చేతికి అధికారం వచ్చేంతవరకు అవిరామ కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్రియాశీల సభ్యులకు త్వరలో రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభించాలని మరియు త్వరలో జరగబోయే పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటన గూర్చి చర్చించడం జరిగింది.