అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం

విజయనగరం: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని శనివారం ఉదయం కె.ఎల్. పురం రితిక్ డాన్స్ స్టూడియోలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సమాజ సేవలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు, ఎక్కువగా రక్తదానం చేస్తూ, రక్తదాన శిబిరాల నిర్వాహకులు, మదర్ థెరిసా ప్రజాసేవా సంఘం వ్యవస్థాపకఅధ్యక్షుడు త్యాడ ప్రసాద్ పట్నాయక్, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడుగా పలు సేవాకార్యక్రమాలు చేస్తున్న చెల్లూరి శ్రీనివాసరావు(సి.హెచ్. రమణ), ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులకు డాన్స్ కాంపిటీషన్స్ లో ప్రతిభను కనబరుస్తున్న ప్రముఖ డాన్స్ మాస్టర్ రితిక్ కు ముఖ్య అతిథులుగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కర్రోతు సత్యం, క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు మాస్టారు సత్కరించారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఉద్యమ కారులు తాడ్డి ఆదినారాయణ, వై.నలమహారాజు, శ్రీను పాల్గొన్నారు.