జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి వినుత కోటా ఆరోగ్య పరిస్థితి విషమం

శ్రీకాళహస్తి, వినుతకి, గ్రామస్థులకు జరగరానిది ఏమైనా జరిగితే జిల్లా కలెక్టర్, ఎస్పీ పూర్తి బాధ్యత. నిరాహార దీక్ష 24 గంటలు గడుస్తున్నా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం బాధ్యతారాహిత్యం. సోమవారం నుండి చిందేపల్లి గ్రామస్థుల కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటాకి, భర్త కోటా చంద్రబాబుకి మరీకొంత మంది గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు మెడికల్ సిబ్బంది సమాచారం. బి.పి, షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం జరిగింది.