వైరా నియోజకవర్గంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వైరా నియోజకవర్గం, ఏన్కూరు: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏన్కూరు జనసేన పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా ఏన్కూరు మండలం, టి యల్ పేట గ్రామం ప్రధాన కూడలిలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం పరస్పరం స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవస్థ మార్పుకై జనసేన పార్టీ ఆవిర్భవించిందని, పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కార్యకర్తలందరం నిరంతరం నిస్వార్ధంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ, కొవూరి మహేష్, చుంచు భాస్కర్, బీసీ సెల్ కోఆర్డినేటర్ పసుపులేటి కృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాశం భరత్, బూరుగు రాము, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మద్దెల పవన్ కళ్యాణ్, భాగం రవి, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ బోజగాని సురేష్, ముక్తి సతీష్, మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ యాకూబ్ పాషా, పోతిని నాగేంద్రబాబు, ఇల్లూరి సురేష్, గిద్దిగిరి విజయ్, అలాసపురి నాగరాజు, ఇల్లూరి నరేష్, పసుపులేటి తరుణ్, ఇల్లూరి సాయి, బాణోత్ అనిల్, బండారు ఉదయ్, ఇండ్ల అనిల్, ఇల్లూరి లక్ష్మీ నరసింహ, సాదం వెంకట పవన్, వాసు, సాదం నాగేశ్వరరావు, బాలు తదితరులు పాల్గొన్నారు.