బెల్లుపడ గ్రామ సమస్యలపై జనసేన వినతి పత్రం

ఇచ్చాపురం నియోజకవర్గం:  బెల్లుపడ గ్రామం నందు గల 13వ వార్డ్ మరియు 12వ వార్డ్ లో మంచి నీటి సమస్య, స్ట్రీట్ లైట్స్ మరియు రోడ్ సౌకర్యం కొరకు ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ దాసరి రాజు ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ కు బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ 13వ వార్డ్, 12వ వార్డ్ మొత్తం కొండవీధి, చిన్న కొండ వీధి, బుడుపు వీధి, రెయ్య వీధి, దల్లి వీధి, నీలపు వీధి, సాషన వీధి మొత్తం. 7 వీధుల వారికీ నీటి సమస్య ఉన్నందున వారు తెల్లవారు జామున 4 గంటలకి కిరశాడ నూతికి వెళ్లడం జరుగుతుంది. ఆ దారిలో లైట్స్ వుండవు, రోడ్లు బాగుండవు, ఇంతకుముందు ఈ వీధులకు ట్యాంకర్లతో నీరు వచ్చేవి. ఇప్పుడు అవి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఆపేశారు. గత 10, 15 సంవత్సరాల నుండి ఎన్నికలు వచ్చినపుడే హామీలు ఇవ్వటం తప్ప ప్రజల సమస్యలు నాయకులు గాలికి వదిలేశారని మా జనసైనికులు ఈ సమస్యను నా దృష్టికి తీసుకుని వచ్చారు. మేము వెళ్లి అక్కడ పరిస్థితులను కనుక్కోవడం జరిగింది. కనుక ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వార్డ్ ఇంచార్జ్ రోకళ్ల భాస్కరరావు, జనసేన నాయకులు నీలాపు సతీష్, హేమంత్, అశోక్, వాసు, షణ్ముఖ, కుమార్, తదితరులు పాల్గొన్నారు.