గ్యాస్ సిలెండర్ డెలివరీ ఛార్జీలు రద్దు చేయాలని ఎమ్మార్వోకి వినతిపత్రం ఇచ్చిన జనసేన

భైంసా పట్టణంలోని పలు ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు కొన్ని వందల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. దాని నిర్వాహకులు లబ్ది దారుల నుండి 20 నుండి 30 రూపాయల వరకు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది..ఇది సరైన పద్దతి కాదు ఏజన్సీ నుండి 10 కి.మీ వరకు ఉచితంగా సప్లయ్ చేయాలి కాని దాన్ని అమలు చేయకుండా ప్రతి రోజు వేయిల రూపాయలు దండుకుంటున్నారు. కంపెనీ ద్వారా జీతాలు తీసుకుంటూ ఇలాంటి పనులు చేయడాన్ని జన సేన పార్టీ తీవ్రంగా వ్యతరేకిస్తుంది. కాబట్టి వెంటనే ఆ ఏజెన్సీల పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, గ్యాస్ సిలెండర్ డెలివరీ ఛార్జీలు రద్దు చేయాలని ఎమ్మార్వోకి జనసేన తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కమిటీ మెంబర్స్ గంగా ప్రసాద్, అర్జున్, మయుర్ తదితరులు పాల్గొన్నారు.