గ్రంధాలయం పునః ప్రారంభించాలని జనసేన వినతిపత్రం

పామూరు గ్రామంలోని శ్రీ పొట్టి శ్రీరాములు వీధిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ గ్రంథాలయ విజ్ఞాన కేంద్రం గత కొన్ని సంవత్సరాలనుండి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ భవనం శిధిలావస్థకు చేరడంతో గ్రంధాలయం ముసివేయబడినది. ఈ వేసవిలో పిల్లలు గ్రంధాలయం లేక పుస్తక పఠనానికి పూర్తిగా దూరమై కేవలం స్మార్ట్ ఫోన్స్ కె పరిమితం అయ్యారు, అందువల్ల వాళ్లలో ఆలోచన శక్తి, సమయస్ఫూర్తి లోపిస్తున్నాయి. కావున గ్రామబావి పౌరుల విజ్ఞాన, వినోదం కొరకు తిరిగి గ్రంధాలయాన్ని పునఃప్రారంభించాల్సిందిగా, అందుకు ఖాళీగానే ఉన్న గ్రామ చావిడి(పాత ఎమ్మార్వో ఆఫీస్) భవనాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా శ్రీయుత పామూరు పంచాయతీ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఈఓ సానుకూలంగా స్పందించి త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి మహిత్, అఖిల్, గోస్టు సునీల్ తదితరులు పాల్గొన్నారు.