ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నూతన ఒరవడికి నాంది పలికిన జనసేన

రాజంపేట, ప్రజలు, యువత ఇష్టపడి ఆర్ధిక సహాయం చేసుకొని, శ్రమదానము చేసి రోడ్డు సమస్యను పరిష్కరించుకోవడము జరిగింది. దీనికి సంబంధించి నాయకులు మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ గతవారం రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలోని వెల్లళూరి వాండ్లపల్లి సందర్శించినప్పుడు, ఆ ఊరూరి ప్రజలు వారి రోడ్డు సమస్యను తెలియజేశారు. అన్నదమ్ములకు అక్కడి ప్రజలకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి కేవలం దోచుకోవడానికి, దోచి పెట్టడాన్ని పెట్టడానికి మరియూ జనసేన అధ్యక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ మీద మరియు ఇతర ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధింపుకు మాత్రమే శ్రద్ద చూపిస్తుందని తెలియజేసి, ఈ సమస్యను వైసీపీ నాయకులకు జగన్మోహన్రెడ్డికి రెడ్డికి చెంపపెట్టు లాగా కావాలంటే మనమే స్వతహాగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది. ఈ సమస్యను ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నా వంతు సాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. మీరు కూడా ఈ రోడ్డు మరమ్మతుకు మీకు తోచినంత సాయం చేస్తే సమాజంలోకి మంచి సందేశాన్ని పంపుతుంది మీరు కూడా బాధ్యత తీసుకుంటారు, ఆలోచిస్తారు అని చెప్పిన వెంటనే ఆ ఊరి ప్రజలందరూ ముఖ్యంగా యువకులు స్పందించి అక్కడ జనసేన కార్యకర్తల సహకారంతో ప్రజలు ఇచ్చిన సహకారంతో మరియు నా సహకారంతో, అద్వానంగా ఉన్న రోడ్డును రిపేరు చేయడం జరిగింది. జనసేన కార్యకర్తలందరూ ఊరి రోడ్డును ప్రారంభించడం జరిగింది. ప్రజలు చాలా సంతోషించారు. జనసేన పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని శ్రీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే మాకు మంచి జరుగుతుందని తెలియజేశారు. ప్రజలందరికీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు ముఖ్యంగా అక్కడి జనసేన కార్యకర్తలకు కార్యకర్తలు నాగార్జున, వెంకటేష్ జైరామ్ ఇతరులకు ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ ఇంచార్జి శ్రీముఖురాన్ చాంద్, రాష్ట్ర చేనేత కార్మిక కార్యదర్శి శ్రీ రాటాల రామయ్య, లీగల్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ కత్తి సుబ్బరుడు, వీరబల్లి, సుందుడుపల్లి, రాజంపేట మరియు నందలూరు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.