మిర్చి రైతులను ఆదుకోవాలి మధిర జనసేన

మధిర, మిర్చి పంటలను పరిశీలించిన జనసేన బృందం కొత్తరకం వైరస్ సోకి నష్టపోయిన మిర్చి పంటలను ఉద్యానవన శాస్త్రవేత్తలు వెంటనే పరిశీలించి, నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మధిర నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బోనకల్ మండలం లోని రావినూతల జానకిపురం, నారాయణపురం, ఆళ్లపాడు, పెద్ద బీరవల్లి గ్రామాల్లో జనసేన బృందంతో పర్యటించి వైరస్ సోకిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు గడ్డు కాలం నడుస్తుందని గత సంవత్సరంలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని చూశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కొద్దో గొప్ప ఆశలు పెట్టుకున్నారని కానీ వేరే రూపంలో వారి ఆశలు అడియాశలయ్యాయి అన్నారు. గత 15 రోజుల నుండి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ వైరస్ రూపంలో పని చేస్తుందని కానీ ప్రస్తుతం తన రూపం మార్చుకుని పోత పిల్లలపై ప్రభావం చూపుతూ వాటిని రాలుస్తుందని అన్నారు. సందర్శించిన మిర్చి తోట నుండి ఉద్యానవన ఉప సంచాలకులుతో ఫోన్లో మాట్లాడుతూ ఇప్పటికైనా ఉద్యానవనశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ వైరస్ నివారణ కోసం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు రైతుల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పై పోరాడుతూ ఎప్పుడు జనసేన పార్టీ రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ నష్టపరిహారం రైతులకు చెల్లించలేని క్రమంలో రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉద్యమం సాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ గంధం ఆనంద్, వేముల వినయ్ కుమార్, బోనకల్ మండలం నాయకులు షేక్ జానీ భాష, ఎస్ కే బాజీ బాబా, కోసూరు అశోక్, ఇసుకల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.