జనసేన ప్రజాబాట ఐదవ రోజు

ఎచ్చెర్ల, జనసేన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ టీమ్ ఆధ్వర్యంలో గురువారం జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామంలో ఇంటి ఇంటికి జనసేన పార్టీ మేనిపెస్టో, షన్ముఖవ్యూహంతో కూడిన ముఖ్య విషయాలను పొంది పరిచిన స్టిక్కర్ను ఇంటియజమాని అనుమతితో ప్రతి ఇంటికి అంటించటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ ఉద్దేశ్యం, సిద్దాంతాలు, మేనిఫెస్టో, షన్ముఖవ్యూహం, అన్నింటినీ ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరితో మాటలు ఆడటం జరిగింది. ఇలా వివరించుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు విశేష స్పందన వచ్చింది. అలాగే ప్రజలు వారికి ఉన్న ఇబ్బందులు సమస్యలు అన్నీ చెప్పుకుంటూ, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడానికి ఎదురు చూస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ సమాధానంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి, బెవర మల్లేష్, కోరాడ రమేష్, చిత్తిరి రామారావు, దన్నాన సంతోష్, బెవర రమేష్, బెవర సాయి, బెవర, అరసవిల్లి రాము, బొద్ధూరు మధు, బాబురావు, మక్క హరికృష్ణ, పొగిరి పవన్ కుమార్, యండమూరి రాజేష్, వాండ్రంగి జనసైనికులు, యువత తదితరులు పాల్గొన్నారు.