విద్యుత్, బస్ చార్జీలు పెంపు, విద్యుత్ కోతలను నిరసిస్తూ భారీ నిరసన

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్, బస్ చార్జీలు పెంపు, విద్యుత్ కోతలును నిరసిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

నిరసన కార్యక్రమంలో భాగంగా పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పితాని బాలకృష్ణ అధ్యక్షతన స్థానిక కాశివారి తూముసెంటర్ లో డా.బి.ఆర్.అంభేద్కర్ విగ్రహనికి పూలమాలు వేసి.. నివాళులర్పించి 216 ప్రధాన రహదారిపై విద్యుత్ సబ్ స్టేషన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.

బాదుడే బాదుడు అంటూ.. అధికారంలో వచ్చి మీరు బాదుతున్నతీరుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.

తక్షణం పెంచిన చార్జీలు తగ్గించాలని ఎన్నికలముందు ఇచ్చిన హమీల కు అనుగుణంగా పాలన సాగించాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎం.ఆర్.ఓ.కార్యాలయం, మరియి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్దానిక తహశీల్దారు కు, విద్యుత్ డి.ఈ కు వినతిపత్రం సమర్పించారు.