దొరమామిడి-బుట్టాయి గూడెం రోడ్డు దుస్థితిపై నిరసనగా జనసేన పాదయాత్ర

పోలవరం నియోజకవర్గం: బుట్టాయిగూడెం మండలంలో దొరమామిడి నుంచి బుట్టాయి గూడెం మధ్య రోడ్డు దుస్థితిపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం సుమారు 10 కి.మీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. 7 మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు సుమారు 500 మందితో భారీగా పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయ్యకుండా నాయకులు, జనసైనికులు కలిసి కట్టుగా ముందుకు సాగారు. అనంతరం బుట్టాయిగూడెం సెంటర్లో భారీ సభ ఏర్పాటు చేసి కరాటం సాయి, గడ్డమణుగు రవి, చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం మేలుకోవాలని రోడ్ల మీద ఇన్ని కష్టాలు పడుతున్నా కనిపించడంచడం లేదా? నియోజకవర్గంలో రోడ్ సమస్యలు తీర్చకపోతే ఖచ్చితంగా రోడ్ నిర్భందిస్తామని, వైసీపీ చేసే తప్పుడు రాజకీయాలకు భయపడే పార్టీ కాదని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని, లోకల్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇప్పటికైనా ప్రజలపక్షాణ ఉండి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని, మేము ప్రతి సమస్యలకు ఏదురోస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు.