పెదనందిపాడు – బాపట్ల ప్రధాన రహదారి దుస్థిపై జనసేన నిరసన

100 అడుగులు కూడా లేని ఈ చిన్న కల్వర్టు నీ పూర్తి చేయలేని ఈ జగన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కడతాను అని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది: గాదె

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను మండలంలో “పెదనందిపాడు నుండి బాపట్ల వెళ్లే” ప్రధాన రహదారిలో దెబ్బతిన్న చప్ట్టాని సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈటీవల వచ్చిన మిఛాంగ్ తుఫాను సమయంలో పడిన వర్షాలకు ఈ ప్రాంతమంతా కూడా ఈ రోజుకి కూడా రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండడంతో స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు అక్కడకు చేరుకున్న జిల్లా అధ్యక్షులు వారు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడికి చేరుకున్న ఆయన రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి ఇక్కడ పడుతున్న ఇబ్బందులు గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సదర్భంగా గాదె మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ చాప్ట నే నిదర్శనం అని చెప్పి తెలియజేయడం జరిగింది. నిత్యం వేలల్లో వాహనాలు తిరిగే ఈ రోడ్డు అధికారుల కళ్ళకి కానీ, అలాగే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అధికారం అనుభవిస్తున్న అధికార పార్టీ వారి కళ్ళకు కానీ ముఖ్యంగా మొన్నటిదాకా మంత్రిగా చేసిన ఈ ప్రాంత స్థానిక ఎమ్మెల్యే గారి కళ్ళకి కనిపించకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి సమాధానంగా నిలుస్తున్నాయని అన్నారు. కోయవారిపాలెం నుంచి బాపట్లకి తోలిన అధిక లోడుతో కూడిన గ్రావెల్ బండ్లు తిరగటంవలనే ఈ చాప్ట పూర్తిగా నాశనం అయిందని అన్నారు.

•100 అడుగులు కూడా లేని ఈ చిన్న బ్రిడ్జిని పూర్తి చేయలేని ఈ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కడతాను అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉన్నపలంగా ఇక్కడ ఉన్న చిన్న బ్రిడ్జిని పూర్తి చేయాలని లేదంటే జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయ కర్త కొర్రపాటి నాగేశ్వరావు, కాకుమాను మండల జనసేన పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, కాకుమాను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సునీల్, పెద నందిపాడు మండల అధ్యక్షులు ఆముదలపల్లి నరేంద్ర, జనసేన నాయకులు కాటూరి శ్రీనివాసరావు, పతెళ్ల.మల్లికార్జునరావు, ఎస్ కె హుస్సేన్, యడ్ల. వెంకట్రావు, కాకుమాను మరియు పెనందిపాడు మండల జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు.