జనసంద్రం నడుమ జనసేన నామినేషన్ పర్వదినం

  • వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు
  • ఆరణి శ్రీనివాసులు గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం

జనసేన, టిడిపి, బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతి అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్వీ యూనివర్సిటీ ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి జనసంద్రం నడుమ ర్యాలీగా బయలుదేరి, మ్యూజిక్ కాలేజ్ కూడలి నందు గల జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి, తిరుపతి అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ నందు మంగళవారం జనసేన, టిడిపి, బిజెపి పార్టీల నేతలు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, మబ్బు దేవ నారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాస్, ఊకా విజయకుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, పులుగోరు మురళి, చిన్నబాబు, దంపూర్ భాస్కర్ యాదవ్, శ్రీధర్ వర్మ, అన్నా రామకృష్ణ, సంధ్య యాదవ్, మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, కంకణాల రజనీకాంత్, బిజేపి.. శాంతా రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, చంద్రప్ప, పొన్నగంటి భాస్కర్, సామంచి శ్రీనివాసులు, పెనుబాల చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం యాదవ్, ముని సుబ్రహ్మణ్యం, జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి ప్రసాద్, ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, మదన్, జగన్, శివ, ఆకె పాటి సుభాషిని, కీర్తన, వనజ, పొలకల మల్లికార్జున్, ఆనంద్, మరియు ముఖ్య నేతలతో కలిసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కూటమి శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, వీరమహిళలు, తెలుగు తమ్ముళ్లు, బిజెపి నేతలు మరియు మూడు పార్టీల కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానికంగా తిరుపతిలో అక్రమాలకు, ఆగడాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడనున్నదని, ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తామన్నారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ప్రత్యేకించి మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని తెలియజేశారు. లా అండ్ ఆర్డర్ ను దారిలో పెట్టడమే బిజెపి, టిడిపి, టిడిపి జనసేన పార్టీల ముఖ్య ఉద్దేశమన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని పలు కంపెనీలు ఏపీకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న అష్ట కష్టాల నుంచి గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎంతో దోహదపడుతుందన్నారు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ను అభివృద్ధి చేసి ప్రజల మన్ననలను పొందడమే ఎన్డీఏ కూటమి లక్ష్యం అని వాపోయారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి తిరుమల లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యం అని, తిరుపతిలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఎక్కడ జరగలేదని, ఒక్క భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం మాత్రమే అభివృద్ధి జరిగిందని, వారి సొంత స్వలాభం కోసం ప్రజల సొమ్ము అయిన కార్పొరేషన్ నిధులతో కొన్ని రోడ్లను వేసి తిరుపతిని సింగపూర్ లా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. తిరుపతిలో ఎన్నడూ చూడని విధంగా మరింత అభివృద్ధి చేసి చూపెడతామని, తనకు ఒక అవకాశం కల్పించాలని స్థానిక పూర్వ ప్రజలను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు. గతంలో బై ఎలక్షన్ సందర్భంగా.. పక్క జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తిరుపతిలో వైసీపీ నమోదు చేయించి గెలుపొందిన సంగతిని గుర్తు చేశారు. గత కార్పొరేషన్, కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లలో దౌర్జన్యాలకు దాస్టికాలకు పాల్పడి గెలిచిన విధంగా ఈ ఎలక్షన్లలో కూడా గెలవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎల్లప్పుడూ కుట్రలతో రాజకీయాలు చేయలేరని ప్రజల మన్నలను పొందాలని వైసిపి పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, తిరుపతిలో కచ్చితంగా గెలుపు ఎన్డీఏ కూటమిదేనని సుగుణమ్మ, భాను ప్రకాష్ రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ లు ఆశాభావం వ్యక్తం చేశారు.