నరవ గ్రామ సమస్యలపై జనసేన నిరసన

పెందుర్తి నియోజకవర్గం: నియోజికవర్గంలోని 88 వార్డ్, నరవ గ్రామంలోని ప్రధానమైన 18 సమస్యలపై జనసేన పార్టీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ రావు మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వాలు తీర్చడం లేదని, ప్రజా ప్రతినిధులు అలసత్వం వలన ప్రజలకు ఈనాడు ఈ కష్టాలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఈ సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొని వస్తామని మాట్లాడారు. స్థానిక నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ప్రతిపక్ష మరియు అధికారపక్ష నాయకులు వైపల్యం వల్ల ఈనాడు గ్రామానికి రావలసిన అభివృద్ధి గానీ, మౌలిక వసతులు గాని ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం లేదని, జనసేన పార్టీ ద్వారా ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు గల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి సంవత్సరం కాలం ఉందని తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం వస్తుందని తప్పకుండా ఈ సంవత్సరకాలం సమస్యలపై పోరాటం చేస్తాం ప్రభుత్వాలు స్పందిస్తే మంచిది లేదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో బొడ్డు నాయుడు, రాడిపంట రావు, గవర శీను, ప్రవీణ్ లింగం, వాసు లింగం, రమేష్, గోపి ప్రసాద్, కృష్ణ, చిన్నారావు, అశోక్, చలం, అప్పలరాజు మరియు జనసైనికులు ప్రజలు పాల్గొన్నారు.