రోడ్ల దుస్థితి పై పెనుగంచిప్రోలు జనసేన నిరసన
*3 వ రోజు #GoodMorningCMSir
పెనుగంచిప్రోలు: జనసేనాని అధ్యక్షులు పవన్‌కల్యాణ్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు రోడ్ల దుస్థితిపై పెనుగంచిప్రోలులో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ప్రధానంగా పెనుగంచిప్రోలు లోనే బైపాస్ రోడ్డు మరియు రేగులగడ్డ వెళ్ళు దారి ముచితాల నుంచి మధుర వెళ్ళు దారిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రోడ్లు బాగు చేయాలని కోరుతూ పెనుగంచిప్రోలు పరిధిలోని పలు గ్రామాలుకు వెళ్లే రోడ్డు వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. గుడ్‌మార్నింగ్ సిఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పెనుగంచిప్రోలు నుంచి ఏ మార్గం వెళ్లినా రోడ్డు మరమ్మతులకు గురవడంతో ప్రజలు, రైతులు, కూలీలు, తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెనుగంచిప్రోలు మండలం అధ్యక్షుడు తునికిపాటి శివ, ఉపాధ్యక్షులు తన్నీరు గోపీనాథ్, ఎలమందల నరసింహారావు (వైఎన్ఆర్ మాస్టారు), వినయ్, చరీ సాయి, గోపీచందు, నాగబాబు నవీన్మరియు తదితరులు పాల్గొన్నారు.