మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుకి అభినందనలు తెలిపిన పాశం నాగబాబు

హైదరాబాద్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబుని కలిసి నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలిపిన నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు తదనంతరం ఆయనతో నియోజకవర్గ పరిధిలో జరిగిన పార్టీ కార్యక్రమాల గురించి 15 నిమిషాల పాటు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గ నాయకులతో మాట్లాడేలా ప్రణాళిక సిద్ధం చేస్తానని తెలిపారు.