రాజోలు ఎల్.ఐ.సి రోడ్డు దుస్థితి పై జనసేన నిరసన

రాజోలు ఎల్.ఐ.సి రోడ్డు పనులు తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం. చినుకు పడితే అద్వాన్నంగా తయారవుతున్న రాజోలు ఎల్.ఐ.సి రోడ్డు, నిధులు మంజూరు అయినా పనులు ముందుకు కదలకపోవడం వలన ఈ రోడ్డు దుస్థితిని రాజోలు ప్రజలకి తెలియచేసాలా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాజోలులో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం రాజోలు డిప్యూటీ ఇంజనీర్ వారి కార్యాలయానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసిలు, వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.