పెంచిన బస్సు చార్జీలపై కడప జనసేన ఆధ్వర్యంలో ధర్నా

కడప: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని కడప పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కడప ఆర్.టి.సీ బస్ స్టాండ్ నందు ఆర్.టి.సీ డీ.ఎం కు వినతి పత్రం అందజేస్తూ.. పెంచిన చార్జెస్ వెంటనే తగ్గించాలని జనసైనికులు కోరారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, మూడవసారి ముచ్చటగా బస్ చార్జెస్ పెంచుతూ నోటిఫికేషన్ జూన్ 30 న విడుదల చేసింది. డీజిల్ రేట్స్ పెరగటం వలన బస్ చార్జెస్ పెంచారు అని కాకమ్మ కథలు చెబుతున్నారు. పల్లె వెలుగు బస్ లలో మొన్ననే 10 రూపాయలు చేశారు. ఇప్పుడు దానిని 15 రూపాయలు చేశారు. సూపర్ లగ్జరి బస్ లో 70 రూపాయలు పెంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేమి దారుణం రెండు నెలల కాలం లో రెండు పెంచడం అత్యంత దారుణం.హేయమైన చర్య. పల్లె వెలుగు లో గరిష్టంగా 25 రూపాయలు పెంచారు. ఎక్స్ప్రెస్ లో 90 పెంచారు. అల్ట్రా డీలక్స్ అండ్ సూపర్ లక్సరీ 120 చేశారు. రూ. 140 ఏ. సి బస్సు లో పెంచారు. జగన్ రెడ్డి గారు అధికారం లోకి రాక ముందు బస్ చార్జెస్ పూర్తిగా తగ్గిస్తామని చెప్పి చీట్ చేశారు. మొన్న 750 కోట్ల బస్ చార్జెస్ పెంచి పేద ప్రజల నడ్డి విరిచారు. ఇప్పుడు మళ్ళీ 500 కోట్లు పేద ప్రజల నుంచి వసూల్ చేసి కడుపు కొడుతున్నారు.
నేను చిన్నప్పుడు నుంచి నేను ఒక్కటే వింటున్న ఆర్టీసీ నష్టాల్లో ఉంది చెపుతూనే ఉన్నారు. పార్టీలు మారినాయి, రాష్ట్రాలు మరినాయి, నాయకులు మారినారు కానీ ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. ప్రతి పక్షంలో ఉన్నపుడు ఆర్టీసీ ఛార్జిస్ పెరిగినాయి అనే వాళ్ళు, అధికారంలోకి రాగానే వాళ్ళు అదే చేస్తారు. ఈ నాయకులు చెప్పే ఒక్కటే మాట డీజిల్ రేట్లు పెరిగినాయి. ఆర్టీసీ కి అప్పులు ఉన్నాయి. ఈ బస్ ఎక్కడం కంటే ఒక బండి కోనుకోవడం మంచిది అనిపిస్తుంది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, కి డీలక్స్ కి, సూపర్ లక్సరీ బస్సు లు, ఏసి బస్ లు అన్నిటికీ పెంచారు. రోజుకు ఒకసారి పెంచుతున్నారు, జీతాలు పెరగవు కానీ బస్ చార్జెస్ పెరుగుతున్నాయి. దీనికి డీజిల్ సెస్ అని ఇలా రక రక లుగా పెంచుతున్నారు. ఇలా రేట్లు పెంచి రోజుకు 3 నుంచి 5 కోట్లు జేబులకి చిల్లు పెడుతున్నారు. డీజిల్ రేట్ పెరిగిందని రేట్స్ పెంచుతున్నారు అంటున్నారు, కానీ మరి కేంద్ర ప్రభుత్వం రెండు చార్లు డీజిల్ రేట్స్ తగ్గించింది మరి బస్ టికెట్ రేట్స్ ఎందుకు తగ్గించడం లేదు. గత రెండు సంవత్సరాలు గా కరోన కారణంగా ఆర్టీసీ కి బాగా నష్టాలు వచ్చాయి. చార్జెస్ పెంపు లేదు అంటూనే డీజిల్ సెస్ పేరిట ,ప్రజల నెత్తిన గుది బండ వేస్తున్నారు. పల్లె వెలుగు 2 రూపాయల, ఎక్స్ ప్రెస్ లో 5 రూపాయిలు, ఏ. సి బస్ లో 10 రూపాయిలు పెంచారు. టికెట్ పై ధర పెంపు లేదు అంటారు, డీజిల్ సెస్ పెంపు అంట, రక రకాలుగా పెంచు తున్నారు. మొన్న విద్యుత్ చార్జెస్ పెంపు, ఇప్పుడు ఆర్టీసీ చార్జెస్ పెంపు. ప్రజలని మోత మోగిస్తున్నారు.ఈ చార్జెస్ పేద ప్రజల నెత్తిన భారం పడుతుంది. రాష్ట్రంలో 11 వేలు పైగా ఆర్టీసీ బస్ లు ఉన్నాయి.సగం పైగా పల్లెవెలుగు బస్ లు ఉన్నాయి. ఇది చార్జెస్ పై పెంపు కాదు అంట, డీజిల్ సెస్ పెంపు అంట. ఆర్టీసీ మినిమం 5 రూపాయిలు చార్జీ ని, 10 రూపాయలు చేశారు.

దీని వలన దాదాపు 720 కోట్లు ప్రజల పైన భారం పడింది. ఇలా టీడీపీ, వైసీపీ ఎవరు వచ్చిన సామాన్య ప్రజల పై పెను భారం పడుతుంది.

ఆస్తి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ చార్జెస్ ఇలా ప్రజల్ని చాకిరేవు వేసి బాది నట్లు బాదు తున్నారు. మన దగ్గర నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేసి మనకి వేదో మంచి చేసినట్లు డ్రామాలు ఆడుతున్న టీడీపీ,వైసీపీకి బుద్ది చెప్పాలి. చిల్లర ఓట్లు కొనడానికి మనకి పడవేసి, కోట్లు వెనుక వేసు కుంటున్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి.

ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమల రావు గారు.. కేవలం 720 కోట్ల భారం పడుతుందని సెలవు ఇచ్చారు. ఇది ఏదో 5 రూపాయలు ఐనట్లు. డీజిల్ సెస్ పెంచిన టికెట్ రేట్ పెంచిన ప్రజలు టికెట్ కొంటే మాత్రం డబ్బులు ఇవ్వాలిచిందే గా.. కరోనా కారణంగా 5600 కోట్లు నష్టాలు వచ్చాయి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకి 200 కోట్లు ఇవ్వవలచిందే అని ఆర్టీసీ కి టార్గెట్ ఇచ్చింది. డీజిల్ పై వేట్ వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆ వేట్ తగ్గిస్తే ఆర్టీసీ కి భారం తగ్గుతుంది. 2019 లో డిసెంబర్ లో టికెట్ రేట్ పెంచారు. ఇప్పుడు మళ్ళీ 2022 లో పెంచారు. అధికారంలోకి వచ్చాక రెండు చార్లు ఆర్టీసీ చార్జెస్ పెంచారు. ప్రతి పక్షం లో ఉన్నప్పుడు ఆర్టీసీ చార్జెస్ పెంచం అన్నారు,విద్యుత్ చార్జెస్ పెంచం అన్నారు. ప్రతి పక్షం లో ఉన్నప్పుడు విరుసు పడతారు, అధికారంలోకి రాగానే మల్లి అదే చేస్తారు.ఏమిటో ఈ విడ్డురం. ఇసుక ధర పెరిగింది, ఆర్టీసీ ధరలు పెరిగాయి, అస్తిపన్నులు పెరిగిపోయాయి. కరోన వలన ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, చేసుకొనేనందుకి పని లేక ప్రజలు అల్లాడుతుంటే, విద్యుత్ చార్జెస్ ఇలా ప్రజల ను తీవ్రమైన ఇబ్బలకి గురి చేస్తున్నారు. 10 వేలు వేస్తున్నాము కదా, హ్యాపీ గా బతుకు తున్నారని జగన్ రెడ్డి గారు అనుకుంటున్నారా. ఆ 10 వేలు ఒక సెకండ్ లో ఐపోతుంది. ప్రజలు అందరు కరోన కారణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బదులు పడుతున్నారు. పెంచిన చార్జెస్ వెంటనే తగ్గించాలి, లేని పక్షంలో జనసేన ప్రజా పోరాటం ఉధృతం చేస్తుందని తెలియజేశారు..