మదాసి కురువ, మదారి కురువలకు కుల ధ్రువీకరణ జారీ చేయాలి

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్లు మండల మదాసి కురువ, మదారి కురువ కుల నాయకులు స్థానిక ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డిని కలిసి భారత రాజ్యాంగం రచించిన నాటి నుండి నేటి వరకు మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని వివరిస్తూ అనాదిగా గొర్రెలు మేకలు కాస్తూ సంచార జీవనాన్ని కొనసాగిస్తున్న కురువగా పిలవబడే మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ కులస్తులకు భారత రాజ్యాంగం 1956 నుండి ఇప్పటివరకు ఎస్సీ కుల లిస్టులో సీరియల్ నంబర్ 31లో ఉన్న కులానికి కుల పత్రాలు అప్లై చేసుకునేలా రెవెన్యూ అధికారులకు 2- 11 -2022 తేదీన రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన జీవో నెంబర్ 53 ప్రకారము అప్లై చేసుకున్న అర్జీదారులను ఎమ్మార్వో గారి పరిధిలో ఎంక్వయిరీ చేసి కుల పత్రాలు జారీ చేయాలని కుల సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కేవీ పెద్దయ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సమన్వయకర్త మదాసి కురువ తిమ్మప్ప, పూజారి శివ, కౌన్సిలర్ లింగన్న, సాంబ, స్టాలిన్, మండల కమిటీ నాయకులు కే లింగమూర్తి, కే శివ, రాము, మధు, బండి శేఖర్, మురళీకృష్ణ, నగేష్ కే తిమ్మప్ప, ఎం కె రామాంజనేయులు, సురేష్ గాదిలింగప్ప బండయ్య తదితర నాయకులు కలవడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే శాసనసభలో కూడా మాట్లాడతానని వ్యక్తం చేశారు.