వై కోట గ్రామంలో కరెంటు కొరతపై జనసేన నిరసన

రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం వై కోట గ్రామంలో శనివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, కడప నాయకులు పివిఎస్ మూర్తి విచ్చేసిన సందర్భంగా కరెంటు కొరతపై జనసేన పార్టీ నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమస్యల పైన చర్చించటమే కాకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లా పైన అవలంభిస్తున్న నిర్లక్ష్య ధోరణి బోలిశెట్టి సునిశితంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో గంధంశెట్టి దినకర్ బాబు మరియు వై. కోట టీం జనసేన సభ్యులు పాల్గొన్నారు.