ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జనసేన నిరసన

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్నం బస్టాండ్ వద్ద శనివారం జనసేన ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ చార్జీలు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మొన్న చెత్త పన్ను, ఆస్తిపన్ను బాదుడు, నిన్న విద్యుత్ చార్జీల పెంపు బాదుడు, నేడు ఆర్టీసీ చార్జీల వీర బాదుడు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు, అనేక రకాల పన్నుల భారంతో సతమతమవుతున్న సామాన్యులపై ఆర్టీసీ చార్జీల పెంపు అదనపు భారం కానుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సొంత వాహనాలు పక్కనపెట్టి సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరటానికి ఆర్టీసీ ప్రధాన మార్గంగా ఎంచుకున్నారు. ప్రతిరోజు 60 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీ చార్జీలు పెంచడం ద్వారా జగన్ రెడ్డి ప్రభుత్వం సామాన్యుడిపై పెన్ను భారం మోపింది. గతానికి భిన్నంగా ఈసారి కిలోమీటర్ ప్రాతిపదికన కాకుండా టిక్కెట్ పై బస్సు ను బట్టి 5 రూపాయల నుండి 15 రూపాయల వరకు పెంచారు. గతంలో పల్లెవెలుగు సర్వీసులకు డీజిల్ సెస్సు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం డీజిల్ సెస్సు తో పాటు ప్రయాణికుల భద్రత సెస్సు కూడా కలిపి చార్జీలు పెంచారు. సామాన్యుడికి అధిక భారం కానున్న ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన ప్రజల పక్షాన నిలబడి జనసేన పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్.వి. బాబు, జనసేన పార్టీ కౌన్సిలర్ మట్ట నాగ పావని జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు, కూనపరెడ్డి రంగయ్య నాయుడు, ర్యాలీ సత్యనారాయణ, శీరం సంతోష్, నవీన్ కృష్ణ, బత్తిన రమేష్, బత్తిన నరేష్, ఖాజా మణికంఠ, శివమణి, పాశం నాగమల్లేశ్వరరావు, దాసరి ఆదినారాయణ, ఎలవర్తి ఆంజనేయులు, పినిశెట్టి రాజు, జన్యువుల నాగబాబు, పిన్నింటి రాంబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.