కురిచేడు మండలంలో ఘనంగా షేక్ రియాజ్ పుట్టినరోజు వేడుకలు

దర్శి, జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు సూచనల మేరకు – జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ 46వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం బోధనంపాడు గ్రామములో ఘనంగా జరిగాయి. జనసైనికులు ఉదయాన్నే పండుగను తలపించే రీతిలో శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయంలో పూజ చేసి కేకును కట్ చేయడం జరిగింది. ఈ వేడుకలు కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, కురిచేడు జడ్పీటీసీ కంటెస్టెంట్ వేమా శ్రీను మరియు ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, పడమర గంగవరం గ్రామ వార్డుకు ఎన్నికైన సభ్యుడు అయిన పసుపులేటి చిరంజీవి ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలలో మాదా వెంకట శేషయ్య మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సన్నిహితంగా ఉండి, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రియాజ్ మరెన్నో పుట్టినరోజులు ఘనంగా చేసుకోవాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇవ్వాలని అన్నారు. వేమా శ్రీను మాట్లాడుతూ నియోజకవర్గ ఇంచార్జి బొటుకు రమేష్ తన పేరును కురిచేడు జడ్పీటీసీగా ప్రతిపాదించిన సందర్భంలో షేక్ రియాజ్ ని పరిచయం చేశారని, ఎంతో ఆప్యాయంగా పలకరించే రియాజ్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థించాను అని అన్నారు. జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ పసుపులేటి చిరంజీవి మాట్లాడుతూ షేక్ రియాజ్ నిగర్వి అని, ఇంచార్జి బొటుకు రమేష్ బాబు ద్వారా కీలకమైన జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా తనపై నమ్మకముంచి తనను ఎంపిక చేశారని, యువతను ఎంతో ప్రోత్సహిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేస్తున్న రియాజ్ మరెన్నో పుట్టినరోజులు మరెంతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేకును గ్రామ పెద్ద వేమా చిన్న నరసయ్య గారితో కట్ చేయించడం జరిగింది. ఈ వేడుకలలో కురిచేడు మండల జనసేన పార్టీ నాయకులు సర్వశ్రీ, పసుపులేటి కొండయ్య, యాదగిరి ఆంజనేయులు, పుల్లలచెరువు వెంకటేశ్వర్లు, బు మంచాల నరసింహారావు, వేమా నాగేశ్వర రావు, సానే మణికంఠ, వేమా రమేష్, వేమా గంగ, గాదె పెద్ద వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతో కోలాహలంగా గ్రామ పెద్దలు, జనసైనికులు, పిల్లల మద్య రియాజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.