జనసేన రైతు భరోసా యాత్ర ప్రచార గోడపత్రిక విడుదల

బనగానపల్లె, పట్టణంలో స్థానిక జనసేన నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు సంబంధించిన ప్రచార గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 ఉంది కౌలు రైతులకు అండగా నిలవడం కోసం రైతు భరోసా యాత్ర చేస్తూ చనిపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులకు ఒక కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున తన సొంత కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తున్నారని గత నెలలో అనంతపురం జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో సహాయం అందించారని అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా అని ఈ నెల 8 ఆదివారం రోజున ఉమ్మడి కర్నూలు జిల్లా శిరివెళ్ళ మండలంలో రైతు భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారని శిరివెళ్లలో రచ్చబండ కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 130 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తారని అన్నారు. గత ప్రభుత్వాల మాదిరే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన రాష్ట్రప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన స్పందించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు డబ్బులు వేస్తున్నారని తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది కౌలు రైతులు చనిపోయారో పూర్తి సమాచారం సేకరించి అందరికీ సహాయం చేయాలని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులను విస్మరించడం తగదని 2024 లో రైతులకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ ని అన్నారు. శిరివెళ్లలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అజిత్, పృద్వి, పెద్దయ్య, కాశీం, కిరణ్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.