పిడుగుపడి మృతి చెందిన బాలుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో నివాసముంటున్న గంధం గురవయ్య కుమారుడు గంధం శంకరయ్య వయసు (15) సంవత్సరాలు గల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. ఈ వార్త విని చలించిన సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా.. పిడుగుపడి మృతి చెందిన బాలుడు గంధం శంకరయ్య తల్లిదండ్రులను.. కుటుంబ సభ్యులను పరామర్శించి జనసేన పార్టీ తరపున జనసైనికులతో కలిసి 12,000 ఆర్థికసాయం అందించి. సంభందిత ప్రభుత్వాధికారులుతో మాట్లాడి… ఆ కుటుంబానికి అండగా ఉంటానని బరోసానిచ్చారు. అంనంతరం దొరవారిసత్రం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు రిషి యల్లంపాటి నెల నెల ఆ కుటుంబానికి 2000 రూపాయిలు ఇస్తామని మాట ఇచ్చారు. అనంతరం దొరవారి సత్రం మండల ఎమ్మార్వో ని కలిసి, ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయి నిరుపేదరికాన్ని అనుభవిస్తూ పూర్తిగా దుఃఖంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆర్థికంగా అండగా నిలవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షుడు రిషి, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, తడ మండల జనరల్ సెక్రెటరీ పులి. దిలీప్, శ్రీను, వెంకీ, తదితరులు పాల్గొన్నారు.