తెలంగాణలో జనసేన ప్రాతినిధ్యం ఉండాలి

* తెలంగాణ పోరాట స్ఫూర్తిని గౌరవించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
* కలసికట్టుగా తెలంగాణలో జనసేన జెండా ఎగురవేద్దాం
* రాష్టం వచ్చిన వెంటనే సమయం ఇవ్వాలనే గత ఎన్నికల్లో పోటీ చేయలేదు
* 26న కూకట్ పల్లిలో శ్రీ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
* కూకట్ పల్లిలో జనసేన ఐటీ మిత్రుల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘తెలంగాణ పోరాటాన్నీ, చైతన్యాన్నీ, స్ఫూర్తినీ ప్రతి సందర్భంలోనూ తలచుకుని గౌరవించే నాయకుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎంతో గౌరవం ఇస్తారు. తెలంగాణ నడిబొడ్డున జనసేన ప్రస్థానం మొదలైంది. ఈ అభివృద్ధి క్రమంలో మనందరి భాగస్వామ్యం ఉంది అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ప్రాతినిధ్యం ఉండాలనే బలమైన ఆశయంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తున్న తరుణంలో పార్టీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఐటీ మిత్రుల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “తెలంగాణ అభివృద్ధి గురించి, భవిష్యత్తు గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆంధ్ర ప్రాంతం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితేనే అక్కడ నుంచి తెలంగాణకు యువత వలసలు తగ్గుతాయని, దీంతోనే తెలంగాణ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరుతాయి అన్నది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇదే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ యువతకు పూర్తిస్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలంటే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి వలసలు ఆగాలి. అలా ఆగాలి అంటే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి జరగాలి. ఆంధ్రాలో అవినీతిరహిత పాలన కోసం, పారదర్శకత కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. దేశమంతా వెతికినా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప నాయకుడు మనకు కనిపించడు. ఆయన ఆలోచన సరళి, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన అమూల్యం.
* ఇన్ఫోసిస్ విశాఖ ఆఫీసుకి రోడ్డు కూడా వేయలేదు
అక్కడి వైసీపీ పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇండోసోల్ అనే కంపెనీకి ఏకంగా 8 వేల ఎకరాలకు పైగా ఎలా కట్టబెట్టారో చూస్తున్నాం. ఐటీ కంపెనీలు లేక, అభివృద్ధి ఆగిపోయి ఆఖరికి ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసిన శాటిలైట్ కార్యాలయాన్ని కూడా తామే తెచ్చినట్లు అక్కడి మంత్రులు చెప్పుకోవడం సిగ్గు చేటు. ఉత్తరాంధ్రలో ఉండి వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసుకున్న శాటిలైట్ ఆఫీస్ అది. ఆ కార్యాలయం ఉన్న ప్రాంతానికి రోడ్డు వేయకుండా ఇబ్బందిపెట్టి ఇప్పుడు వెళ్లి రిబ్బన్ కట్ చేశారు. ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇదే జనసేన లక్ష్యం.
* ఒక అవకాశం ఇవ్వాలనే అప్పట్లో పోటీ చేయలేదు
తెలంగాణ ఏర్పాటు సాకారం కాగానే వెంటనే రాజకీయ పోటీ ఉండకూడదని గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కచ్చితంగా తెలంగాణ పాలకులకు అవకాశం ఇవ్వాలనే కోణంలోనే పోటీ వద్దని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. తెలంగాణకు ఇప్పుడు జనసేన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మనం పోటీ చేయకూడదు అని ఏం లేదు. మనం ఎలాంటి తప్పు చేయలేదు. ఇక్కడ నాలుగు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఇక్కడే పెట్టాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా పని చేద్దాం. తెలంగాణ గొప్పగా ఎదిగేందుకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎందరో కృషి ఉంది. ఎన్నో పెట్టుబడులు పెట్టి, ఈ ప్రాంత అభివృద్ధిలో అందరి శ్రమ ఉంది. భవిష్యత్తును నమ్మి ఈ ప్రాంతాల్లో మన ముద్ర వేశాము. దానివల్లనే తెలంగాణలో 9 లక్షల ఐటీ ప్రోఫెషనల్స్ ఉంటే, ఆంధ్రలో కేవలం 25 వేల మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడున్న ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ పార్టీ అభ్యున్నతి కోసం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
* ఢిల్లీ వెళ్లి ప్రజల కోసమే అడిగారు
2019 ఎన్నికల అనంతరం వైసీపీ దాష్టిక పాలన మొదలైన తర్వాత 2020లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఢిల్లీ వెళ్ళినపుడు కేంద్ర పెద్దల వద్ద ప్రజల సమస్యల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అమరావతి రైతుల వేదనను, వైసీపీ పెడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకుని వెళ్లారు. అప్పుడే బీజేపీ పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పని చేద్దాం అని సూచించారు. అలాగే 2014లో దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు రావాలని భావించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశానికి సుస్థిర ప్రభుత్వం ఉంటేనే దేశం పురోగమిస్తుందని నమ్ముతారు. దేశం ఆర్ధికంగా ముందుకు వెళ్లడమే కాకుండా, భద్రంగా ఉండాలంటే బలమైన నాయకత్వం అవసరం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. కూకట్ పల్లి అతి పెద్ద నియోజకవర్గం. పార్టీకి మంచి పట్టున్న ప్రాంతం. కష్టపడే శ్రీ ప్రేమ్ కుమార్ గారి లాంటి వ్యక్తి పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని నమ్ముతున్నాను. పార్టీ ఐటీ విభాగం కూడా ఆయనకు తోడుగా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 26వ తేదీన కూకట్ పల్లిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ ఉంటుంది. శ్రీ అమిత్ షా గారితో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో బలంగా ముందుకు వెళ్లేందుకు కలసికట్టుగా ముందుకు వెళ్లాలి. కూకట్ పల్లిలో జనసేన పార్టీ కార్యాలయం పెట్టి, పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా పని చేద్దాం” అన్నారు. ఈ సమావేశంలో కూకట్ పల్లి జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి, ఐటీ విభాగం చైర్మన్ శ్రీ మిరియాల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం, పార్టీ నేతలు శ్రీ మలినీడి తిరుమలరావు (బాబీ), శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ పిసిని చంద్రమోహన్, శ్రీ మండలి రాజేష్, శ్రీ మైఫోర్స్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.