జనసేన పార్టీ సమావేశాలకు అవసరమైన సౌండ్ సిస్టం బహుమతిగా ఇచ్చిన జనసైనికులు

ఇచ్చాపురం, బుధవారం ఉదయం ఇచ్చాపురం నర్తుపుటుగా చెందిన జనసైనికులు నారాయణ మూర్తి, ధర్మారావు, కృష్ణా రావు ఇచ్చాపురం జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ సమావేశాలకు అవసరమైన సౌండ్ సిస్టం మరియు మైకును బహుమతిగా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ సమావేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలుసుకొని ఇంత మంచి బహుమతి ఇచ్చిన జనసైనికులకు ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు కి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.